Petroleum Minister Dharmendra Pradhan had on Wednesday said that the government is thinking about bringing fuels prices under the ambit of GST which will lessen the price burden on consumers.
తాజాగా పెరిగిపోతున్న పెట్రో ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. ప్రస్తుతం పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాలు తగ్గించకపోగా.. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిరంగ వేదికల్లో కోరుతుండటం గమనార్హం. ఇక రాష్ట్రాలు కూడా కేంద్రం పన్నులు తగ్గిస్తే పెట్రో ధరలు తగ్గుతాయని చెబుతున్నాయి. ఇలా రెండు ప్రభుత్వాల వైఖరి కారణంగా ప్రజలపై పెను భారం తప్పడం లేదు.