Director Ram Gopal Varma responds on Lakshmis Veeragrantham poster.
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై వివాదం కొనసాగుతోంది.
మరోవైపు, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తన తండ్రి బయోపిక్ తీయనున్నారు. ఇప్పుడు మూడో బయోపిక్ తెరపైకి వచ్చింది.
దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌ను తీస్తున్నట్లు తెలిపారు. రామారావుపై ఉన్న అభిమానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. లక్ష్మీపార్వతి పాత్ర కోసం వాణి విశ్వనాథ్, రాయ్‌లక్ష్మీలను సంప్రదించారు.నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, జనవరిలో సినిమాను విడుదల చేయన్నుట్లు కేతిరెడ్డి తెలిపారు. కేతిరెడ్డి సినిమాలతో పాటు తమిళ రాజకీయాల్లోను చురుగ్గా ఉన్నారు.తన సినిమాలో ఎన్టీఆర్ తొలి భాగం, ఆఖరి భాగం కాకుండా ఆ మధ్యలో జరిగిన విషయాలు వెల్లడిస్తానని కేతిరెడ్డి తెలిపారు. ప్రజలకు తెలియని విషయాలు ఉంటాయన్నారు.