రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేది వీళ్లే! : Full List | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-31

Views 3K

A Revanth Reddy, who quit the Telugu Desam Party (TDP) yesterday, is all set to join Congress on October 31 in the presence of AICC vice-president Rahul Gandhi.
అనుకున్నట్టే రేవంత్ టీటీడీపీ ఊడ్చేసే పనిలో పడ్డారు. తాను పార్టీ వీడిందే గాక తనతో పాటు కీలక నేతలందరినీ వెంట పెట్టుకునిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ మధ్యాహ్నాం 1.30గం. సమయంలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.
సాయంత్రం 4గం. సమయంలో రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ చేరిక ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తనతో పాటు టీడీపీని వీడుతున్నవారి జాబితాను రేవంత్ రాహుల్ కు అందించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 25మంది టీడీపీ కీలక నేతలు పార్టీని వీడుతున్నట్టు ఊహాగానాలు వినిపించగా.. ప్రస్తుతం మరికొన్ని పేర్లు అందులో చేరాయి.
సింగిల్‌గా ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తనకంతగా ప్రాధాన్యం దక్కదనే విషయాన్ని రేవంత్ గుర్తించారు. కాబట్టే టీడీపీ నుంచి వీలైనంత మందిని తన వెంట లాక్కెళ్లాలని భావించారు. అనుకున్నట్టుగానే ఆ పనిలోను విజయవంతం అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఏడుగురు జిల్లా స్థాయి అధ్యక్షులతో రాజీనామా చేయించారు. మరో ఆరు జిల్లాల అధ్యక్షులు కూడా నేడో రేపో రాజీనామా చేస్తారని తెలుస్తోంది. కేవలం టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందినవారు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS