రవితేజ కోసం దిల్ రాజు బోల్డ్ డిసిషన్

Filmibeat Telugu 2017-11-02

Views 799

Tollywood's Mass Maharaj Raviteja latest movie Raja the great going with superb collections. This movie got 10 crores share in Nizam itself. Huge response from public, The producer Dil Raju wanted to add three more comedy scenes to the movie. From saturday, three scenes are going to Raja the great.
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ రాజా ది గ్రేట్‌. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ప‌టాస్‌, సుప్రీమ్ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో స‌క్సెస్‌ను అందుకున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.. అదేమిటంటే..
అక్టోబ‌ర్ 18న విడుద‌లైన రాజా ది గ్రేట్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. భ‌ద్ర త‌ర్వాత ర‌వితేజ‌, దిల్‌రాజు క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు ధీటుగా రాజా ది గ్రేట్ సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌తో స‌త్తా చాటింది.కేవలం నైజాంలోనే 10 కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది.
కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS