The Narendra Modi government has decided to put a leash on “fake news” or “wrong reporting” by denying official advertisements to erring media outlets.
It was a major set back to lakhs of students who have secured Engineering degrees since 2001 through correspondence.
తప్పుడు వార్తా కథనాలకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు తప్పుడు కథనాలను ప్రచురించే మీడియా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం 2016లో తీసుకొచ్చిన ప్రింట్ మీడియా కొత్త చట్టంలోని 25 క్లాజ్‌ను ఆయుధంగా చేసుకోవాలని భావిస్తోంది. మీడియాలో పక్షపాత వైఖరి పెరిగిపోతున్నందునా.. దురుద్దేశపూరిత అవాస్తవ కథనాలు ఎక్కువగా ప్రచురితం అవుతున్నాయని ప్రెస్ కౌన్సిల్ గుర్తించింది.
ఈ ఏడాది 'ఫేక్ న్యూస్' అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టాలని యోచిస్తోంది. ప్రకటనలు నిలిపేస్తే ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి.. అలా అయితేనే సదరు మీడియా సంస్థలు దారికొస్తాయని కేంద్రం భావిస్తోంది.