PM Modi Meets Indian U-17 Football Team : Video | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-11

Views 19

Prime Minister Narendra Modi on Friday met the Indian U-17 football team, who represented the nation in the FIFA World Cup for the first time in Indian sports history. The India U-17 team was invited by Prime Minister Modi at his office after they came back from Saudi Arabia following the AFC U-19 Championship Qualifiers.

అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగాలని భారత యువ సాకర్ ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హితబోధ చేశారు. భారత్ వేదికగా జరిగిన అండర్-17 ఫిఫా ప్రపంకప్‌లో భారత్ జట్టు అంచనాలకు మించి రాణించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని మేటి జట్లకు పోటినిస్తూ మన యువ ఆటగాళ్లు సత్తాచాటారని ఈ సందర్భంగా మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ముగించుకుని సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన యువ భారత్ జట్టు శుక్రవారం ప్రధాని మోడీని కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే వ్యాఖ్యలు చేశారు. అండర్-17 ప్రపంచకప్ ద్వారా మీ ప్రతిభ ఏంటో అందిరికి తెలిసొచ్చిందని అన్నారు. 'రాబోయే 5-7 ఏళ్లు ఇదే రీతిలో నిలకడగా రాణించి దేశం ఖ్యాతిని మరింత ఇనుమడింపచేయాలి. మీ భుజస్కంధాలపై ఆ బాధ్యత ఉంది' అని మోడీ అన్నారు.

Share This Video


Download

  
Report form