YS Jagan Padayatra : జగన్, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం

Oneindia Telugu 2017-11-11

Views 362

Scuffle took place between YSRCP cadre and YS Jagan's security in Padayatra at Potladurthi village

ప్రజా సంకల్పయాత్ర ఐదో రోజు పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ శనివారం ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ భద్రతా సిబ్బందికి, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాదయాత్రలో జగన్ తో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు ఎగబడటంతో సిబ్బంది వారిని నిలువరించారు. ఒకానొక దశలో సిబ్బంది వారిని తోసేయడంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో సిబ్బందికి-కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారితీసింది.
జగన్ దగ్గరకు తమను అనుమతించలేదన్న కారణంతో కొంతమంది వైసీపీ నేతలు నిరసనకు దిగారు. కాగా, పోట్లదుర్తి గ్రామంలో జగన్ కు ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రతో ముందుకు కదిలారు.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ప్యారడైజ్ పేపర్స్ లీక్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారిశ్రామికవేత్త పీవీపీ పేరు కూడా వినిపిస్తోంది. మారిషస్ లో ఓ కంపెనీని నెలకొల్పిన ఆయన.. అక్కడి నుంచి స్వదేశంలోని పలు కంపెనీలకు పెట్టుబడులు తీసుకొచ్చారన్న విషయం వెలుగుచూసింది. ఆ సొమ్ముతోనే వైసీపీ అధినేత జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ లోను పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ప్యారడైజ్ పేపర్స్ లో వెల్లడైన సమాచారం సరైందేనని, అయితే తామెక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని పీవీపీ చెబుతుండటం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS