Jagan Padayatra : అంత ఆస్థి ఉంచుకుని, రూ.1లక్ష కోసం కక్కుర్తి ఎందుకు ? | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-16

Views 1.6K

Prashant Kishor and his team was stayed at a hotel in Kadapa for one month during Jagan's padayatra in district

పీకే టీమ్‌కు వైసీపీ నేతకు చెందిన ఓ హోటల్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర తీరు తెన్నుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు సలహాలు-సూచనలు అందిస్తోంది పీకే టీమ్.ఈ క్రమంలో కడప జిల్లాలోని ఓ హోటల్లో బస చేసిన సందర్భంగా.. బిల్లు విషయమై గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలు రంగంలోకి దిగి హోటల్ యాజమాన్యానికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగినట్టు సమాచారం.
ఇడుపులపాయ నుంచి నవంబర్ 6న జగన్ తన పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి 15రోజుల ముందే ప్రశాంత్ కిశోర్ టీమ్ కడపకు చేరుకుంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో మకాం వేసి పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దం చేసింది.నెల రోజుల పాటు అదే హోటల్లో మకాం వేసిన పీకే టీమ్.. పాదయాత్రకు సంబంధించి చాలానే కసరత్తులు చేసింది. ఎక్కడెక్కడా పార్టీ పట్ల ప్రజల స్పందన మెరుగ్గా ఉ:ది.. ఎక్కడ బలహీనంగా ఉందన్న అంశాలపై ఫోకస్ చేసింది. జగన్ పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఇక్కడే రచించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS