శశికళ పెరోల్ పై వచ్చి ఏం చేసిందో తెలుసా ? | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-17

Views 1.4K

Sasikala was busy with her personal works, especially about properties. Actually she came out on parole for his husband.

శశికళ ఎక్కడున్నా ఆమె చుట్టూ ఏదో వివాదం ముసురుకుంటూనే ఉంది. ఆఖరికి జైల్లోను రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పెరోల్‌పై బయటకు వచ్చిన ఆమె.. భర్త అనారోగ్యం సాకు చూపించి వ్యక్తిగత వ్యవహారాలు చక్కదిద్దకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. శశికళ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నవేళ.. పలు ఆస్తులను ఆమె ఇతరుల పేర్ల మీదకు మార్చే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
న భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చూసేందుకు అనుమతించాలని శశికళ 15 రోజుల పెరోల్ కోరారు. ఈ మేరకు ఆమె కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తన భర్త నటరాజన్‌కు లివర్ మార్పిడి చేయనున్నారని, కాలేయంతోపాటు శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం లేదని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన కోర్టు శశికళ కోరినట్టు 15రోజులు కాకుండా.. ఐదు రోజుల పెరోల్ కు అనుమతినిచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS