మహేష్ బాబు ఫ్యామిలీనుంచి మరో హీరో..!

Filmibeat Telugu 2017-11-27

Views 1.1K

Ashok is Superstar Mahesh Babu‘s elder sister Padmavati’s son so one can expect Mahesh also do his bit for launching the new entrant.

తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికైనా సరే సూపర్ స్టార్ అంటే కృష్ణనే. మూడు దశాబ్దాల పాటు ఆయన వెండితెరపై మెరిశారు. ఆయన తర్వాత ఆయన నటవారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు ఎంటరయ్యాడు. ఈ తర్వాత అదే కుటుంబం నుంచి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరొక హీరో రంగప్రవేశం చేయబోతున్నాడు. మహేష్ బావ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ తన మామయ్యలాగా సినిమా రంగంలో రాణించాలని..
వచ్చే ఏడాది ఈ హీరోగారు వెండితెర ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతున్నాడట. ఈ నేపథ్యంలో తండ్రి గల్లా జయదేవ్.. పలువురి దర్శకుల నుంచి కథలు కూడా వింటున్నాడట.
అయితే ఈ సినిమాను మహేశ్ సొంత బ్యానర్‌లో ఉంటుందా లేక గల్లా జయదేవ్ బ్యానర్‌లో ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. గల్లా అశోక్ కోసం.. గల్లా యువ సైన్యం పేరుతో ఒక అభిమాన సంఘం కూడా వెలిసింది. ఇంకా సినిమా విడుదల కావడం పక్కనపెడితే.. కనీసం సినిమానే ఫైనల్ కాలేదు.. ఇంతలోనే అభిమాన సంఘమా అని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.
అయితే హీరో అయ్యేందుకు అవసరమైన అంశాల్లో అశోక్ కు చాలా రోజుల ముందే ట్రైనింగ్ మొదలెట్టేశారని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS