Pawan Kalyan Tour: I Don't Know Pawan Kalyan Says YS Jagan

Oneindia Telugu 2017-12-07

Views 2.5K

YSRCP president YS Jaganmohan Reddy on Wednesday said that he will not know Janasena President Pawan Kalyan personally.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో తనకు పరిచయం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ ఎంటరౌతారని, చంద్రబాబును పవన్ విమర్శించరని జగన్ అన్నారు.
ప్రత్యేక హోదాపై తనది, పవన్‌ది ఒకే మాటే అయినా పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, చంద్రబాబు ప్రభావం నుంచి పవన్ బయటకు రావాలని జగన్ అన్నారు.
చంద్రబాబు మోసం, అన్యాయం చేస్తారనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదని జగన్ అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి పోటీచేసే అవకాశం ఉందన్న ప్రశ్నకు జగన్ సమాధానం చెబుతూ.. ఎవరు అధికారంలోకి రావాలన్నా ప్రజలు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని జగన్ చెప్పారు. పాదయాత్ర చేస్తున్న జగన్ .. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పందించారు. కాగా, జగన్‌పై పవన్ తన విశాఖ పర్యటనలో విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form