2019 : పవన్ కళ్యాణ్ బాబుతో కలుస్తారా ? లేదంటే పవన్ - చిరు కలుస్తారా ?

Oneindia Telugu 2017-12-12

Views 644

It is said that Congress leader Chiranjeevi talking about Pawan Kalyan's Jana Sena alliance in 2019?

2019 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ మళ్లీ టీడీపీతోనే దోస్తీ కడతారా? వైయస్సార్ కాంగ్రెస్ చెప్పినట్లుగా చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు జనసేనాని బయటకు వస్తున్నారా? అంటే ప్రస్తుతం ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.పవన్ కళ్యాణ్ ప్రతి మాటలో స్పష్టత ఉందని, కానీ ఆవేశం మాత్రం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను ప్రతిపక్ష నేత జగన్‌ను గత ఎన్నికల్లో సమర్థించకపోవడానికి, చంద్రబాబుకు మద్దతు పలకడానికి పవన్ చెప్పిన కారణాన్ని తప్పుబట్టలేమని అంటున్నారు.
ఇంకా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన మాటలే అప్పుడప్పుడు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చాయని గుర్తు చేస్తున్నారు. విభజన నేపథ్యంలో నవ్యాంధ్రకు చంద్రబాబు అనుభవం అవసరమని ఏపీ ప్రజలు ఓట్లు వేశారని విపక్షాలు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించాయి. పవన్ కూడా అందుకే మద్దతిచ్చానని చెప్పారు. కాబట్టి బాబుకు మద్దతివ్వడంలో ఆయనను ప్రశ్నించే అవకాశం వైసీపీకి లేకుండా పోయిందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS