బౌన్సర్లను పెట్టి మరీ 1200మంది టెక్కీలను తొలగించిన కంపెనీ

Oneindia Telugu 2017-12-15

Views 10

Verizon confirmed the 'layoffs' in its IT workforce, including in Verizon Data Services India. The layoffs by Verizon come on the back of several IT companies retrenching a number of employees

ఐటీ ఉద్యోగులపై 'లే ఆఫ్స్' కత్తి వేలాడుతూనే ఉంది. ఏ క్షణాన ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితిలో టెక్కీలు ఒత్తిడికి లోనవుతున్నారు. కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తీసేస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో పడుతున్నారు. తాజాగా వెరిజాన్ కంపెనీ 1200మంది టెక్కీలను తొలగించింది. సంస్థ పునరుద్దరణ చర్యల్లో భాగంగా వీరిని తొలగించారు. తొలగించిన ఉద్యోగుల్లో ఎక్కువమంది హైదరాబాద్, బెంగళూరు బ్రాంచిల్లో పనిచేస్తున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలు ఊడిపోవడంతో వారు ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు.
ఉద్వాసనకు గురైన హైదరాబాద్ వెరిజాన్ ఉద్యోగులు లేబర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలంగాణను సంప్రదించారు. తమ సమస్యల గురించి వివరించి న్యాయం చేయాలని కోరారు. కాగా, వెరిజాన్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో దాదాపు 7వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది.
కస్టమర్లకు మేము ప్రపంచ స్థాయి నాణ్యతను, ఉత్పత్తులను అందించాలనుకుంటున్నాం. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీ రీత్యా సంస్థాగతంగా మార్పులు తప్పట్లేదు. అందుకు అనుగుణంగానే టెక్నాలజీని సమకూర్చుంటున్నాం, అదే సమయంలో సంస్థను ప్రక్షాళన చేస్తూ వెళ్తున్నాం' అని వెరిజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS