MCA : నానిని లైట్ తీసుకున్న సాయి పల్లవి కానీ ఇరగదీసింది !

Filmibeat Telugu 2017-12-18

Views 5

Natural Star Nani starrer latest romantic and family entertainer movie ‘MCA’ (Middle Class Abbayi). Film is gearing up for grand release on 21st December.

ఎంసీఏ చిత్రంలో నాని, సాయి పల్లవి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వాళ్ళిద్దరూ గొడవ పడ్డారని, షూటింగ్‌లో నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకొన్నారని, షూటింగ్ స్పాట్ నుంచి నాని వెళ్లిపోయారు అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్త అనేక రూమర్ల కు దారి తీసింది. కాగా ఎంసీఏ ప్రీరిలీజ్ ఫంక్షన్ రీసెంట్ గా వరంగల్‌లో జరిగింది. వారి మధ్య గొడవ నెలకొందని వస్తున్న వార్త నేపథ్యంలో ఎంసీఏ ఫంక్షన్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ సందర్భంగా అందరి పేర్లను గుర్తు చేస్తూ మాట్లాడిన సాయి పల్లవి.. నాని గురించి చెప్పడం మరిచిపోయింది. అంతలోనే తప్పులో కాలేసానని తెలుసుకొన్న ఆమె నాని గురించి చెప్పింది.
ఫిదా చిత్రంలో కూడా వరుణ్ గురించి మాట్లాడటం మరిచిపోయాను. ఇప్పుడు కూడా నాని గురించి చెప్పడం మరిచిపోయాను. నాని గురించి ఏం చెప్పాలి. ఆయన చాలా హార్డ్ వర్కర్. ప్రతీ సీన్ ముందు దాని గురించి బాగా ఆలోచిస్తారు. ఆయనకు దర్శకత్వంపై బాగా పట్టు ఉన్నది. త్వరలోనే ఆయన దర్శకుడిగా మారితే చూడాలని ఉంది అని సాయి పల్లవి చెప్పింది. సాయిపల్లవి మాట్లాడుతూ ఉన్నంత సేపు నాని వెనుక నిల్చొని ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. నానిని పొగడ్తలతో ముంచెత్తుండగా ఆనందంతో మురిసిపోయాడు. వారిద్దరి మధ్య వేదికపై కెమిస్ట్రీ చూసిన తర్వాత గొడవలు లేవని తేలిపోయాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS