డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : యాంకర్ ప్రదీప్‌కు శిక్ష తప్పదా ?

Oneindia Telugu 2018-01-02

Views 1

Out of the total 2,499 cases booked, 1,683 cases were registered by the Hyderabad Traffic Police, followed by 582 cases in Cyberabad. With 234 cases, Rachakonda saw the least number of violations.
కొత్త ఏడాది 2018 సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూఇయర్ పేరుతో కొందరు యువకులు మద్యం మత్తులో జోగుతారనే విషయం తెలిసిందే. కొత్త ఏడాది అసలు మందు, పబ్బు కోసమే అన్నట్లుగా ఉంది. అందుకే ఇలాంటి న్యూఇయర్‌ను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆనందంగా చేసుకుంటేనే పండుగ. కానీ పూటుగా తాగి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరికాదనేది చాలామంది అభిప్రాయం. న్యూఇయర్ 2018 సందర్భంగా కూడా చాలామంది యువత పబ్బులు, క్లబ్బులలో ఎంజాయ్ చేశారు.

హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు. పలువురిపై కేసు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. ఆదివారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్కరోజే హైదరాబాదులో 55,540 వాహనాలను తనిఖీ చేశారు. 1683 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూఇయర్ పేరుతో పోలీసులకు పట్టుబడిన కార్లలో ఎక్కువగా ఖరీదైనవే ఉండటం గమనార్హం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిండా ఖరీదైన కార్లు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం తాగితే నిందితులకు జైలు శిక్ష పడ అవకాశముంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే పబ్బులు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎక్కువగా దొరికారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS