చిరుదే పైచేయి..: వెనుకబడ్డ పవన్ కల్యాణ్?

Filmibeat Telugu 2018-01-19

Views 1.3K

Megastar Chiranjeevi is in top than Power Star Pawan Kalyan?

ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు? అన్న ప్రశ్నకు ఎవరి సమాధానాలు వారికి ఉన్నా.. అంతిమంగా కలెక్షన్సే దాన్ని డిసైడ్ చేస్తాయి. అలా ప్రతీ శుక్రవారం ఈ జాబితా మారిపోతూనే ఉంటుంది. కొత్త రికార్డులు పుట్టుకురానంత కాలం పాత రికార్డులు పదిలంగానే ఉంటాయి.ఇకపోతే ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనింగ్స్ పరంగా ఆయన సినిమాలెప్పుడూ పాత సినిమాల రికార్డులు బద్దలు కొడుతాయనే అభిప్రాయం ఉంది. అయితే చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ కంటే పవర్ స్టార్ వెనబడిపోయి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గతేడాది మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నం.150 ఇదే సీజన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటివారంలోనే రూ.77కోట్లను కలెక్ట్ చేసింది. దీంతో అప్పటిదాకా పవన్ పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. అయితే పవన్ కెరీర్‌లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమా 'అత్తారింటికి దారేది'. ఆ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, రీసెంట్‌‌గా వచ్చిన అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో పవన్ కెరీర్‌లో ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ కలెక్షన్స్‌కు అత్తారింటికి దారేదితోనే బ్రేక్ పడింది. అయితే తాజాగా విడుదలైన పవన్ అజ్ఞాతవాసి సినిమా దారుణంగా బోల్తా కొట్టడంతో.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై పడింది. దీంతో మొదటివారంలో ఈ సినిమా కేవలం రూ.50కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన పవన్ కంటే మెగాస్టార్ నటించిన ఖైదీ నం.150 తొలివారంలో రూ.77కోట్ల కలెక్షన్స్ తో ముందంజలో ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS