మహేష్‌-సందీప్ వంగా మూవీ లేటెస్ట్ అప్‌డేట్..!

Filmibeat Telugu 2018-01-20

Views 1.2K

'Arjun Reddy' director, Sandeep Reddy Vanga is likely to collaborate with Superstar Mahesh Babu in his next movie.


ఎంట్రీతోనే టాలీవుడ్‌ను షేక్ చేసి పారేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతోనే అటు బాలీవుడ్, కోలీవుడ్ లోనూ తన గురించి చర్చించుకునేలా చేశాడు. అదే సమయంలో స్టార్ హీరోల నుంచి ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్‌తో మూవీకి డీల్ ఓకె అయిందన్న వార్తలు వస్తున్నాయి..
ప్రస్తుతం అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు సందీప్. అర్జున్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ తో సినిమాను పట్టాలెక్కిస్తారని టాక్.
ప్రస్తుతం మహేష్ కూడా భరత్ అనే నేను సినిమాతో బిజీగా ఉన్నాడు. వేసవిలో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
నిజానికి మహేష్ తో సినిమాకు సందీప్ సిద్దంగానే ఉన్నప్పటికీ.. అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టుల రీత్యా మహేష్ ఆయన్ను వెయిటింగ్ లిస్టులో పెట్టక తప్పలేదు.
మహేష్ తో సినిమాకు మరో ఏడాది పట్టే అవకాశం ఉండటంతో.. ఆలోగా బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ చేస్తానని ఇటీవలే నమ్రతతో సందీప్ చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఎవరి సంగతెలా ఉన్నా.. మహేష్‌తో మూవీ గనుక ఫిక్స్ అయితే ఈసారి సందీప్ వంగా ఎటువంటి కథతో వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ క్యారెక్టర్‌ను అద్భుతంగా మలిచిన సందీప్.. మహేష్‌ను కూడా మునుపెన్నడూ చూడని యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తాడా? అన్నది చూడాలి. ఇప్పటికైతే వీరిద్దరి కాంబినేషన్‌పై ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి మున్ముందు ఆ వివరాలేమైనా తెలుస్తాయేమో చూడాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS