Telangana Congress leader V Hanumanth Rao questioned Jana Sena chief Pawan Kalyan.
తెలంగాణలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాంగ్రెసు నేతలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా మండిపడుతున్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, ఎమ్మార్పియస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వంటి నాయకులను అరెస్టు చేస్తూ పవన్ కల్యాణ్ పర్యటనకు ఎందుకు అనుమతిస్తారంటూ ప్రశ్న వేస్తున్నారు. కాంగ్రెసు నాయకుడు పొన్నం ప్రభాకర్‌తో పాటు వి హనమంతరావు కూడా పవన్ కల్యాణ్‌పై మండిపడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రశ్నలు వేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవినీతి, అక్రమాలపై ఎందుకు మాట్లాడడం లేదని వి. హనుమంతరావు ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్చి రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇది పవన్ కల్యాణ్‌కు కనిపించలేదా అని ఆయన అడిగారు.
కోదండరామ్‌ను రాష్ట్రంలో తిరగనివ్వలేదని, మాదిగ రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన మందకృష్ణను అరెస్టు చేశారని అంటూ అది అక్రమం కాదా అని విహెచ్ అడిగారు. పవన్ కల్యాణ్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయని, వాటికి సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు.