'నా పేరు సూర్య' ఆ సినిమా కు కాపీ నా ?

Filmibeat Telugu 2018-01-29

Views 1.1K

Allu Arjun-Vakkantham Vamshi much anticipated film 'Naa Peru Surya' is plagued by rumours of being inspired by hollywood film Antwonefisher

హిట్టు సినిమా తీయాలంటే హాలీవుడ్ నుంచి కథలు ఎత్తుకురావాల్సిందేనా?.. అయినా అంతలా ఎవరు గమనిస్తారులే అనుకుంటే అడ్డంగా బుక్కయిపోయినట్లే. 'అజ్ఞాతవాసి' విషయంలో త్రివిక్రమ్‌పై పడ్డ మచ్చ తుడుచుకుంటే పోయేదా?.. ఇంత జరిగినా! మన దర్శకుల తీరులో మార్పు రావట్లేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్‌లో వస్తున్న 'నా పేరు సూర్య' సినిమాపై కూడా ఇప్పుడు కాపీ ఆరోపణలు వస్తుండటం గమనార్హం.
'నా పేరు సూర్య' సినిమా లైన్‌ను 'ఆంట్వోన్ ఫిషర్' అనే హాలీవుడ్ నుంచి తీసుకున్నట్లు ప్రచారం మొదలైంది. 2002లో 'ఫైండింగ్ ఫిష్' అనే నవల స్ఫూర్తిగా తెరకెక్కిన 'ఆంట్వోన్ ఫిషర్' ఆధారంగానే 'నా పేరు సూర్య' దర్శకుడు వక్కంతం వంశీ కథ అల్లుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిగ్రహం అనే పదానికి అర్థమే తెలియని ఓ యువకుడు.. అతని కోపం కారణంగా సైన్యంలో కొన్ని శిక్షలకు గురవుతాడు. అతని ఆవేశం, కోపంపై ఉన్న ఫిర్యాదులతో.. ఓ సైక్రియాటిస్ట్ వద్దకు అతన్ని పంపించి క్లీన్ చిట్ తెచ్చుకోవాలంటారు.
ఆ సైక్రియాటిస్ట్ అతని తండ్రే కావడం.. అతను క్లీన్ చిట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడం కథలో హైలైట్‌గా నిలుస్తుంది. అయితే కొడుకుకు కొన్ని కఠిన పరీక్షలు పెట్టి.. అతని పట్ల సంతృప్తి చెందాక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాడు. కానీ అప్పుడు దాన్ని తీసుకోవడానికి కొడుకు నిరాకరిస్తాడు. బోర్డర్ లో కంటే ఇక్కడే ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండిపోతానంటాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS