Kamal Haasan To Launch Political Outfit Tomorrow

Oneindia Telugu 2018-02-20

Views 110

Delhi Chief Minister Arvind Kejriwal is likely to attend Haasan’s Madurai rally. Kerala CM Pinarayi Vijayan are also reportedly invited although their participation has not been confirmed.

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న హీరో కమల్ హాసన్ బుధవారం తన సొంత పార్టీ పేరు, పార్టీ సిద్దాంతాలు వెల్లడించడానికి వేదిక సిద్దం అయ్యింది. బుధవారం మదురైలో జరిగే కమల్ హాసన్ బహిరంగ సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్ పినరయితో సహ వామపక్ష పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు హాజరై ఆయన్ను ఆశీర్వదించనున్నారు.
తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన హీరో కమల్ హాసన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చెన్నైలోని అళ్వార్ పేటలోని తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో రాజకీయాలపై కమల్ హాసన్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు సలహాలు తీసుకున్నారు.
సినీ కార్యక్రమంలో భాగంగా కోల్ కతా వెళ్లిన కమల్ హాసన్ పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం రాజకీయాలపై మమతా బెనర్జీతో కమల్ హాసన్ సుదీర్ఘంగా చర్చించారు. తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వీరాభిమాని అని కమల్ హాసన్ అప్పట్లో మీడియాకు చెప్పారు
హీరో కమల్ హాసన్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయి ఇంటికి వెళ్లి ఆయనతో అనేక విషయాలపై చర్చించారు. తనకు రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో కేరళ సీఎం విజయన్ పినరయి నుంచి సూచనలు సలహాలు తీసుకుంటానని, ఆయన తనకు గురువులాంటివారని హీర్ కమల్ హాసన్ అన్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలిత, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ వారి రాజకీయ జీవితాలను మదురై నుంచి ప్రారంభించారు. ఇప్పుడు అదే బాటలో హీరో కమల్ హాసన్ నడుస్తున్నారు.

Share This Video


Download

  
Report form