Priyanka Chopra’s picture in the Assam Tourism calendar became controversy. Disha Patani and Manushi Chiller gets trolled before.
ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఓ సంచలన నటి. ఆ ఖ్యాతి ఇప్పుడు అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రియాంక చోప్ర 35 ఏళ్ల వయస్సులో కూడా దుమ్మురేపే అందం, పెర్ఫామెన్స్ తో దూసుకుపోతోంది. అందాల ఆరబోతలో ప్రియాంకకు ఎవరూ సాటి రారు అనేంతగా ఘాటు ఫోటోషూట్ లతో యువత మతి చెదరగొడుతోంది. ప్రియాంక ఎంతటి అందగత్తో అంతే స్థాయిలో ఆమె చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. గతంలోనే ప్రియాంక గ్లామర్ షో పై కొన్ని వివాదాలు వచ్చాయి. తాను ఎలా కనిపించినా, ఏం చేసిన తన వృత్తి కోసమే అంటూ గతంలో జవాబు ఇచ్చింది. తాజాగా ఈ భామ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రియాంక చోప్రా తాజాగా మరో కాంట్రవర్సీకి కారణం అయింది. ప్రియాంక చోప్ర అస్సాం టూరిజం కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డ సంగతి తెలిసిందే. అసెం టూరిజం కోసం పీసీ గతంలో ప్రచారం నిర్వహించింది కూడా. ఇటీవల అస్సాం టూరిజం క్యాలండర్ కొరకు ప్రియాంక చేసిన ఫోటోషూట్ తీవ్రమైన కాంట్రవర్సీకి కారణం అయింది. పీసీ ఆ ఫోటో షూట్ లో మునుపటికంటే హాట్ హాట్ గా క్లివేజ్ షో తో చెలరేగిపోయింది. పీసీ వ్యవహారంఇప్పుడు రాజకీయ రగడగా మారింది.
మూడు పదుల వయసులో కూడా ఘాటైన సొగసుని మైంటైన్ చేయడం ఒక ఎత్తయితే, రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుపోవడం మరో ఎత్తు. ప్రియాంక మాజీ విశ్వసుందరి. 2000 లో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. అప్పటికి ఇప్పటికి ప్రియాంక అందం పెరిగిందే తప్ప తరగలేదు.
ప్రియాంక టాలెంట్ కు హాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం క్వాంటం సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందాల ఆరబోతే కాదు రొమాంటిక్ సీన్లలో సైతం పీసీ చెలరేగిపోతోంది.