Renu Desai Gives Strong Counter To Pawan Kalyan Fans

Filmibeat Telugu 2018-03-03

Views 878

Renu Desai gives strong counter to Pawan Kalyan fan. Renu desai appeals Pawan fans dont put this type of comments.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయాకు కూడా స్నేహితులుగా కొనసాగుతున్నారు. పిల్లలకోసం పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ పూణేకు వెళుతుండడం గమనిస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికి తనని వదినా అనిపిలుస్తూ మద్దతుగా నిలుస్తున్నారని, మరి కొందరు ఇబ్బంది పెడుతున్నారని రేణుదేశాయ్ పలు సందర్భాల్లో అన్నారు.
సోషల్ మీడియాలో రేణు దేశాయ్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన విషయాలని అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల రెండు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ కవితని పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ వలన దేశాయ్ పవన్ అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేణు కూడా అంతే ఘాటుగా స్పందించారు.
రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కు సంబందించిన పలు విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇటీవల రేణు దేశాయ్ కవిత రూపంలో ఓ వీడియోని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పోస్ట్ చేసారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ వీడియోని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెండుతున్నారు. ఇలాంటి పోస్ట్ లు పెట్టడం వలన పవన్ కళ్యాణ్ ఇతర రాజకీయ నాయకులకు టార్గెట్ గా మారుతున్నారని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.
ఈ కామెంట్ కు రేణు దేశాయ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. నా కవిత వలన ఆయన ఎలా టార్గెట్ అయ్యారు అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సంస్కారం లేకుండా కామెంట్లు పెట్టవద్దు అని హితవు పలికారు.

Share This Video


Download

  
Report form