Police On Alert After Statues Vandalised: Another case of vandalism was reported in Kolkata today; BJP icon Syama Prasad Mookerjee's bust was found damaged.
తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ కోయంబత్తూరు జిల్లా కేంద్ర కార్యాలయంపై యువకులు పెట్రోల్ బాంబుతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెరియార్ విగ్రహాలకు, బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయం మీద పెట్రోల్ బాంబుతో దాడి చేసిన సమయంలో సమీపంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. బీజేపీ కార్యాలయంలో ఉన్న ఓ వ్యక్తి యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి.
పెరియార్ విగ్రహాలు ధ్వంసం చెయ్యాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్. రాజా పిలుపునివ్వడంతో ఢిల్లీలో డీఎంకే పార్టీకి చెందిన నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో బీజేపీ వర్గ రాజకీయాలకు పిలుపునిచ్చి తమిళ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు.