The budget session of Andhra Pradesh Assembly begun 5th with the address of Governor ESL Narasimhan. Minister Yanamala Ramakrishudu to introduce budget today at 11.30 am.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం (08-03-2018) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు ఉండనుందని తెలుస్తోంది. చ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాయిలాలకు ప్రధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. జలవనరులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు, ఉపాధికి, పింఛన్లకు పెద్ద మొత్తాలు ప్రతిపాదించనున్నారు.
గురువారం ఉదయం ఏడున్నరకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం నివాసం వద్ద ఉన్న ఫిర్యాదుల విభాగం హాలులో కేబినెట్ భేటీ జరుగుతుంది. బడ్జెట్‌ను ఆమోదిస్తారు. అనంతరం ఉభయ సభలకు సమర్పిస్తారు. పదకొండున్నరకు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అపరిష్కృతంగా ఉన్న అంశాలకు పెద్ద పేట వేయనున్నారని తెలుస్తోంది. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించనున్నారు. సామాజిక అంశాలకు, సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నారు. రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్ భారీగా ఉండనుంది. సామాజిక అంశాలు, సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది.