Shruti Haasan: పడుకునే ముందు.. అది తప్పనిసరి, లేకపోతే నిద్రపట్టదు

Filmibeat Telugu 2018-03-16

Views 2.4K

Heroine Shruti Haasan said that every time she will do self check to improve her personality. Before going to sleep she have a habbit to remember all the day time incidents

ప్రతీ మనిషికి 'సెల్ఫ్ చెక్' అనేది అవసరం. విలువలు అన్న మాటకు అర్థమే లేని సమాజంలో ఇదో 'రియాలిటీ చెక్'. జీవితపు ప్రవాహంలో.. ఏదో అలా పడి కొట్టుకుపోవడం కాకుండా.. కాస్త ఆత్మపరిశీలన చేసుకోవడం ఆత్మ సంతృప్తినిస్తుంది. అన్నింటికి మించి జీవితానికో అర్థమిస్తుంది. అందుకే హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా ఈ సూత్రాన్ని తప్పక ఫాలో అవుతాను అంటున్నారు.
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అంతా ఉరుకుల పరుగుల జీవితం. బిజీ షెడ్యూల్. రాత్రయ్యేసరికి రోజంతా ఏం చేశామన్నది గుర్తుచేసుకునే టైమ్ కూడా ఉండదు. కానీ నేనలా కాదు. ప్రతీరోజు నిద్రకు ఉపక్రమించే ముందు అన్నీ గుర్తుచేసుకుంటా.
అలా గుర్తుచేసుకునే క్రమంలో.. ప్రధానంగా రెండు విషయాలు బాగా గుర్తుంచుకుంటా. ఒకటి.. ఆరోజు అయిష్టంగా ఏదైనా పని చేసి ఉంటే.. ఇక జీవితంలో దాని జోలికి వెళ్లను. రెండు.. అకారణంగా ఎవరినైనా బాధపెట్టి ఉంటే.. మళ్లీ తప్పు రిపీట్ చేయకూడదని బలంగా నిశ్చయించుకుంటాను. ప్రతీరోజూ ఇలా సెల్ఫ్ చెక్ చేసుకోకపోతే నాకు నిద్రపట్టదు.
ఇంత మంచి అలవాట్లు అలవడానికి తన నాన్నే కారణమంటున్నారు శ్రుతీహాసన్. 'ఇదంతా నాన్న వల్లే. ఎప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోలేదంటే.. ఆరోజు నువ్వేదో చేయకూడదని పని చేసి ఉంటావ్.. జీవితంలో ఇక మళ్లీ పని చేయవద్దు' అన్న సూత్రాన్ని పదేపదే చెప్పేవారట.
వ్యక్తిగతంగా మన తప్పొప్పుల్ని ఆత్మపరిశీలన చేసుకోవడం అత్యవసరం. మన వ్యక్తిత్వాన్ని మరింత ఇనుమడింపజేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది' అని చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS