Ugadi 2018 : "ఉగాది" ఎలా జరుపుకోవాలి? పంచాంగ శ్రవణం ఆంతర్యం ?

Oneindia Telugu 2018-03-17

Views 76

Ugadi is a special occasion for the people in South India especially for those in Andra Pradesh and Karnataka. Pandits or elders of the family recite Panchanga in the Ugadi evening in temples or public gatherings.

యుగానికి ఆదిగా జరుపుకునే పండగ ఉగాది. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను తెలుగు వారు జరుపుకుంటారు. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. వసంత ఋతువు కావటం చేత పకృతిలో ఉన్న చెట్లన్ని కొత్త లేత చిగుళ్లతో, పూల పరిమళాలతో పచ్చగా కళకళ లాడుతూ శోభాయమానంగా కనిపించే సుందర దృష్యాలను చూసి కోయిలలు పులకరించి మన వీనులకు విందు కలిగించే కమ్మని స్వరాలతో ఆనందింప జేస్తాయి.
18 మార్చి 2018 ఆదివారం రోజు ను శ్రీ విళంభి నామ సంవత్సర ఉగాది పర్వదినం గా పంచాంగాలు, నిర్ణయ సింధూ, ధర్మ సింధు, మూహూర్త సింధువుల ద్వార నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఈ పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలు,పెద్దలు శాస్త్ర విధిగా తలంటు స్నానం,నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. నుదుట బొట్టును పెట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని తరువాత భగవంతుడిని పూజించాలి. పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, పంచాంగశ్రవణం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలాలు కలుగుతాయి. ఉగాది రోజు ప్రత్యేకం పచ్చడి. ప్రకృతి నుండి అప్పుడప్పుడే కొత్తగా వచ్చే కాయలు, పూతలు వీటి ద్వార "ఉగాది" పచ్చడి చేస్తారు.
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం వినడం ఆంతర్యం ఎమిటంటే
ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఖగోళంలో ఉన్న గ్రహాల స్థాన ప్రభావ ఫలితంగా మన మహర్షులు తెలిపిన ప్రకారం పన్నెండు రాశులు, 27 నక్షత్రాలను ప్రామాణికంగా తీసుకొని కాల గణనం చేస్తూ వస్తున్నాము. ఈ నూతన తెలుగు సంవత్సరాది నాటి నుండి సంవత్సర కాలం పాటు వ్యక్తి జాతక రాశి జన్మనామం ఆధారంగా గోచార గ్రహా ఫలితాలు ,ఆ సంవత్సరంలో జరగబోయే మంచిచెడులు, వర్షపాతం, రైతులకు ఏ పంటలు పండిస్తే లాభాలు కలుగుతాయి, తాను,కుటుంబం,దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రహస్థితి గతులను ఆధారంగా తరుణోపాయాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడాని అవకాశం ఉంటుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS