Priya Varrier to star opposite Tamil superstar Suriya. Director gives clarity
ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ గురించి చిన్న వార్తకు కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల ప్రియా వారియర్ బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి. టెంపర్ రీమేక్ చిత్రంలో రణవీర్ సింగ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని బాలీవుడ్ కోడై కూసింది. ఆ తరువాత ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. మరో వైపు తమిళ హీరో సూర్య సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కూడా క్లారిటీ వచ్చింది. కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రియా వారియర్ ని హీరోయిన్ గా తీసుకోబుతున్నారని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై దర్శకుడు కెవి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. తాము ఇంతవరకు ఏ హీరోయిన్ ని సంప్రదించడం జరగలేదని ఆయన అన్నారు. ఈ సినిమాకి స్టార్ హీరోయిన్ నే తీసుకునే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ప్రియాకు స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాకపోవడానికి ఓ వాదన వినిపిస్తోంది. ప్రియా ఇంకా 18 ఏళ్ళ టీనేజ్ పిల్లగానే కనిపిస్తోందని.. సూర్య, రణవీర్ సింగ్ సరసన నటించేంత వయసు ఆమెకు లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ప్రియా చిత్రపరిశ్రమలో ఎలాంటి ప్రభావం చూపుతుందో!