Bharat Ane Nenu Becomes The World's Second Most Liked Teaser

Filmibeat Telugu 2018-03-24

Views 4

Superstar Mahesh Babu will be playing the role of a CM for the first time in his career in the upcoming film Bharat Ane Nenu. The teaser titled Vision of Bharat crossed more than 14 million views and got likes with at present 655K likes.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. మహేష్ బాబు తొలిసారిగా నటిస్తున్న పొలిటికల్ మూవీ ఇది. ఇందులో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల 'విజన్ ఆఫ్ భరత్' పేరుతో విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
రెండు వారాల క్రితం విడుదలైన ఈ టీజర్ ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 14 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా 655k లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ టీజర్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో అత్యంత ఎక్కువ మంది లైక్ చేసిన రెండో టీజర్‌గా రికార్డుల కెక్కింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రం ఆడియో వేడుక ఏప్రిల్ 7న జరుగనుంది. డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share This Video


Download

  
Report form