Ram Gopal Varma Tweets On Rangasthalam

Filmibeat Telugu 2018-04-03

Views 1.9K

"Rangasthalam is truly a centre stage bullet achievement..Ramcharan is mindblowingly fantastic ..and hey aryasukku Here’s my 3 to you and also my 3 to u." RGV tweeted.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ప్రతి ఒక్కరూ సినిమా బావుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. 'రంగస్థలం' నిజంగా సెంటర్ స్టేజ్ బుల్లెట్ అచీవ్మెంట్. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ అని వర్మ ట్వీట్ చేశారు. సుకుమార్‌ను ఉద్దేశించి.... హేయ్ సుక్కూ ఇదిగో నీ కోసం నా 3 దండాలు, 3 ముద్దులు...అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు.
సాధారణంగా వర్మకు రోటీన్‌గా ఉండే సినిమాలు నచ్చవు. అయితే ‘రంగస్థలం' సినిమా ప్రత్యేకంగా ఉండటం, ఇప్పటి వరకు రాని ఒక సరికొత్త బ్యాక్ డ్రాపుతో సినిమా సాగడం వర్మకు తెగ నచ్చేసింది.
అయితే వర్మ చేసిన ట్వీట్ మీద సుకుమార్ ఫ్యాన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. ‘సినిమా ఎలా తీయాలో రంగస్థలం చూసి నేర్చుకో. ఊరికే ట్విట్టర్ ఓపెన్ చేసి అక్కు పక్షిలాగా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం కాదు' అంటూ ఓ మహిళా అభిమాని వర్మకు సూచించారు.
అయితే దీనికి వర్మ అభిమాని ఒకరు స్పందిస్తూ...... ఆర్జీవీకి సినిమా ఎలా తీయాలో చెబుతావా? అసలు సుకుమార్ ఇండస్ట్రీలోకి వచ్చిందే వర్మ సినిమాలతో స్పూర్తి పొంది. వర్మ గురించి ఆయన ఎన్నోసార్లు పొగడ్తలు గుప్పించారు. కామెంట్స్ చేయడానికి కూడా ఓ అర్థం ఉండాలి అంటూ సుక్కు మాట్లాడిన వీడియో షేర్ చేస్తూ మండి పడ్డారు.
దీనికి సదరు మహిళా అభిమాని రిప్లై ఇస్తూ... ‘తెలుసు తెలుసు... ఆర్జీవి గురించి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తెలుసు. శివ నుండి ఐస్ క్రీమ్ వరకు మొత్తం తెలుసు' అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చారు. ఇలా వర్మ చేసిన కామెంట్ మీద సోషల్ మీడియాలో అభిమానుల మధ్య రచ్చ మొదలైంది.

Share This Video


Download

  
Report form