IPL 2018 : KKR Beat RCB By 4 Wickets

Oneindia Telugu 2018-04-09

Views 161

Despite a good effort by Umesh Yadav, who restricted the Kolkata run-rate, the other Royal Challengers' bowlers proved ineffective.
Mandeep Singh (37 off 17) took time to settle down but stretched RCB's total, thanks to a last-over blitz off Vinay Kumar (2/30). He scored 16 runs in the first three balls before falling in the penultimate ball of the RCB innings.

ఐపీఎల్‌-11 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు(ఆర్సీబీ) శుభారంభాన్ని నమోదు చేయలేకపోయింది. ప్రత్యర్థి కోల్‌కతా జట్టు కోహ్లీ సేన నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో కేకేఆర్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ సునాయాసంగా ఛేదించింది. కేకేఆర్‌ ఆటగాళ్లలో సునీల్‌ నరైన్‌(50) చెలరేగి ఆడగా, అందుకు నితీశ్‌ రానా(34), దినేశ్‌ కార్తీక్‌ ( 35 నాటౌట్‌)లు చక్కటి సహకారం అందించారు.
బెంగుళూరు జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 176 స్కోరును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం మరో రసవత్తర పోరు మొదలైంది. టోర్నీ మూడో మ్యాచ్‌లో త‌ల‌ప‌డేందుకు దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ సిద్ధమైయ్యాయి
టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో హార్డ్‌హిట్టర్లు మెక్‌కలమ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్వింటన్ డికాక్‌లతో ఆర్‌సీబీ పటిష్ఠంగా ఉంది.
మరోవైపు క్రిస్‌లిన్, ఉతప్ప, దినేశ్ కార్తీక్, రస్సెల్‌తో కోల్‌కతా కూడా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. దీంతో అభిమానులకు మరో అసలైన మజా అందించేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అభిమానులతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కిక్కిరిసిపోయింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS