Allu Arjun turned a year older on Sunday, and as a birthday treat for his fans, the 'Stylish Star' shared a dialogue promo from his upcoming film, Naa Peru Surya. In the 40-second teaser, he schools an ignorant villain who calls him "South India ka saala".
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్ రిలీజ్ చేశారు. ఆ డైలాగ్ ఇంపాక్ట్ లింకును స్టైలిష్ స్టార్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసుకొన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆ లింక్‌పై అనేక దారుణమైన కామెంట్లు విసిరారు. ఇంతకీ అంత దారుణంగా స్పందించాల్సిన విషయముందా అంటే..
నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్‌లో అల్లు అర్జున్‌ను ఉద్దేశించి సౌత్ ఇండియా కా సాలా అని ఓ బూతు డైలాగ్‌ను ఓ విలన్ అంటాడు. దానికి సమాధానంగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ లాంటి అన్ని ఇండియాలు మనకు లేవురా. కేవలం ఒకటే ఇండియా మాత్రమే ఉంది అంటూ అల్లు అర్జున్ తన డైలాగ్‌తో సమాధానం చెబుతాడు.
అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌కు మంచి స్పందన వచ్చింది. డైలాగ్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ తన ట్విట్టర్ అకౌంట్‌లో సౌత్ ఇండియన్ యాక్టర్ అని స్టాటస్‌ను అల్లు అర్జున్ పెట్టుకోవడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సినిమాలో చెప్పేదొకటి.. నిజ జీవితంలో చేసేది ఒకటి (హిపోక్రాట్) అంటూ కొందరు కామెంట్ చేశారు.
ఒకటే ఇండియా అని చెప్పడానికి ముందు సౌత్ ఇండియన్ యాక్టర్ అనే బయోను మార్చుకో. ఎందుకీ ద్వంద ప్రమాణాలు అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు.
నీవు చెప్పే డైలాగ్స్‌ను ముందు నీవు ఆచరించాలి. యాక్టర్‌గా నీ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తాం. ట్విట్టర్ బయోలో సౌత్ ఇండియన్ యాక్టర్ ఉంది. ఓ సారి జాగ్రత్తగా చూసుకో అని ఓ నెటిజన్ అన్నారు
నీవు సౌత్ ఇండియన్ యాక్టర్ అనే బయోను ఇండియన్ యాక్టర్‌గా మార్చుకోగలరు. అలా చేస్తే చాలా బాగుంటుంది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇలా చాలా మంది తమకు తోచిన విధంగా పలు రకాలుగా కామెంట్లతో అదరగొట్టారు.
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా డైలాగ్ కంటే ట్విట్టర్‌లో నీ బయో ఇంపాక్ట్ బాగుంది. అల్లు వారి జల్లు అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. ఇలా దారుణమైన కామెంట్లు పెట్టి వారిపై స్టైలిష్ స్టార్ ఫ్యాన్ తగిన విధంగా రిప్లైలు ఇస్తున్నారు.