IPL 2018: Matches Unlikely To Be Shifted Out Of Chennai

Oneindia Telugu 2018-04-11

Views 18

Rajiv Shukla has talked To concerned officers in order have a safe game for ipl.He Says that the match was planed to held in other places in view of kauveri issue

రెండేళ్ల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను చూద్దామనుకున్న చెన్నై ప్రేక్ష‌కుల‌కు ఆనందం ఎక్కువ‌సేపు నిల‌వ‌లేదు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నైలో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో వేదికకు త‌ర‌లించిన‌ట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మంగళవారం చెన్నై, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియంలోకి పాముల్ని వదులుతామని ప్రో-తమిళ్ పార్టీ తమిళగ వాళ్వురిమై కచ్చి (టీవీకే) హెచ్చరించింది. దీంతో 4 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
దీంతో 400 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెపాక్ స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు.కావేరీ జలవివాదం పరిష్కారం అయ్యే వరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిషేధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో చెన్నైలో చెన్నై మ్యాచ్‌లు సజావుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను మంగళవారం ఆయన కలిశారు.
ఇందులో భాగంగా చెన్నైలో జరిగే మ్యాచ్‌లను వేరొక వేదికకు తరలించాలని నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు. కావేరీ జల వివాదంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై మ్యాచ్‌లను విశాఖపట్నం లేదా హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

Share This Video


Download

  
Report form