Pawan Kalyan Severly Blamed By Sri Reddy

Filmibeat Telugu 2018-04-17

Views 2.9K

Srireddy sensational comments on PawanKalyan. She use abusive words to comment on Pawan Kalyan

శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు తీవ్రంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పోరాటానికి మహిళా సంఘ నాయకురాళ్లు, జూనియర్ ఆర్టిస్టుల మద్దత్తు లభిస్తోంది. ఇటీవల మీడియా సమావేశంలో కొందరు జూనియర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సోమవారం మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. పవన్ తల్లిని తిడుతూ పేర్కొనలేని పరుష పదజాలాన్ని ఉపయోగించింది. దీనితో పవన్ ఫాన్స్ శ్రీరెడ్డిపై మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ని తాను అన్న అని పిలిచానని ఆయన స్పందన విన్నాక తనని తాను శిక్షించుకోవాలని మీడియా ముందు శ్రీరెడ్డి పాదరక్షలతో కొట్టుకుంది. ఇక మీదట ఏ మహిళా పవన్ కళ్యాణ్ ని అన్నా అని పిలవదు అని మాట్లాడింది.
పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తాజాగా శ్రీరెడ్డి తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకుంది. తాను పవన్ కళ్యాణ్ తల్లికి మాత్రమే క్షమాపణ చెబుతానని.. పవన్, పవన్ ఫాన్స్ కు చెప్పనని తెలిపింది. పవన్ కళ్యాణ్ స్పందన, ఆయన అభిమానులు పెట్టిన కామెంట్ల వలనే తాను అలా మాట్లాడవలసి వచ్చిందని శ్రీరెడ్డి పేర్కొంది.
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రముఖ రచయిత కోన వెంకట్ స్పందించారు. జరిగిన ఘటనతో తాను కలత చెందానని అన్నారు. అయినా కూడా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయవద్దని పవన్ ఫాన్స్ కు పరోక్షంగా సూచించారు. తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఎవరూ తాకలేరని అన్నారు. ఆయన చాలా పెద్ద కార్యం కోసం బిజీగా ఉన్నారని తెలిపారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS