According to an opinion poll conducted by Flash Team and TV 5 Kannada, 38.11 percent respondents prefer BJP's BS Yeddyurappa for the chief ministerial post, followed by CM Siddaramaiah with 37.03 per cent and former CM HD Kumaraswamy with 18. 33 percent.
#karnataka elections 2018
#amitshah
#narendramodi
#siddaramaiah
#yeddyurappa
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎక్కువ సర్వేలు హంగ్ వస్తాయని చెబుతుంటే, ఓ సర్వే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి. హంగ్ వస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెబుతున్నాయి.
224 అసెంబ్లీ స్థానాలకు గాను కావాల్సిన 113 మేజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీకి రాదని, ఎక్కువ సీట్లు మాత్రం గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. మేజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ కాంగ్రెస్ మెజార్టీ సీట్లతో ముందు నిలుస్తుందని తెలిపాయి.
అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే ఆసక్తిని రేపుతోంది. టీవీ 5 చేసిన సర్వే బీజేపీకి సంతోషాన్ని కలిగించేలా, కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చేలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో 38,400 శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించారు. ఏప్రిల్ 13 నుంచి మే 6 మధ్య టీవీ 5 కన్నడ ఛానల్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని తేలింది. తాగునీరు సహా ఏ సమస్యలు తీరడం లేదని చాలామంది సర్వేలో వెల్లడించారు.
వరుసగా వస్తున్న సర్వేలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రారంభంలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందని సర్వేలలో తేలింది. ఏప్రిల్ నెలలో హంగ్ అని ఎక్కువ సర్వేలు చెబితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒకటి రెండు సర్వేలు చెప్పాయి. కానీ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిస్తూ కర్నాటక బీజేపీదేనని టీవీ5 సర్వేలో తేలింది.
అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని, హంగ్ వస్తుందని చెబితే ఈ సర్వే మాత్రం అందుకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తోందని చెబుతోంది. లేదా రెండు మూడు సీట్లు మాత్రమే తగ్గవచ్చునని చెబుతోంది.