Pawan Kalyan Simplicity In Tirumala Tirupati

Filmibeat Telugu 2018-05-14

Views 7

Jana Sena Chief Pawan Kalyan has visited Tirumala by walk taking the steps at Alipiri. On the way, he rested for a while and there were dogs which he warmly fed with chips, with much affection and love.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదివారం తెల్లవారు ఝామున ఆయన కాలినడకన మెట్లదారిలో తిరుమల చేరుకున్నారు. ఈ క్రమంలో అలిసిపోయిన ఆయన మధ్య మధ్యలో మెట్ల మీదే కూర్చుని సేదతీరారు.
పవన్ కళ్యాణ్ రేంజి ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వ్యక్తి కాలి నడకన తిరుమల చేరుకోవడం, వీధి కుక్కలు, చెత్త కుప్పల పక్కన కూర్చొని సేదతీరడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
మెట్ల దారిలో తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా అలిసిపోయారు. కొండపైకి చేరుకున్న అనంతరం కొంతసేపు ఇలా రిలాక్స్ అయ్యారు.
‘మదర్స్ డే అంటే అమ్మను తలచుకోవడం మాత్రమే కాదు. అమ్మ మనకు ప్రసాదించిన జీవితాన్ని తలచుకోవడం. ఈ జీవితాన్ని మనకు ప్రసాదించడంలో అమ్మ చేసిన త్యాగాన్ని తలచుకోవడం. అమ్మ నేర్పిన ప్రతి అనుభూతిని నెమరు వేసుకోవడం. మదర్స్ డే అంటే.. ఏదో ఏడాదికి ఒక రోజు తల్లిని తలచుకుని మిగిలిన రోజులు మొత్తం మరచిపోవడం కాదు. అమ్మంటే మనం జీవించి ఉన్న ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ఒక బాధ్యత. ఏం చేసినా అమ్మ రుణం తీర్చుకోలేం. అమ్మ నుంచి మనం పొందడం మాత్రమే తప్ప ఇవ్వడం అనేది మన శక్తికి మించిన పని అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు రాగానే మీడియా ప్రతినిధులు ఆయన్ను చుట్టు ముట్టారు. అయితే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు మాట్లాడి తిరుమల పవిత్రతకు భంగం కలిగించడం ఇష్టం లేదంటూ పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS