Prabhas Overtakes Mahesh Babu In Race

Filmibeat Telugu 2018-05-23

Views 605

Mahesh Babu’s recent film – managed to crush Prabhas’ Baahubali 2 at the Chennai box office! It’s a feat that no other film has managed to achieve. Bharat Ane Nenu is currently one of the highest grossing films of 2018. One popular website organised a survey to know who was the bigger superstar between the two – Mahesh Babu or Prabhas! The one and only Baahubali aka Prabhas! He has received a whopping 52% votes!
#BharatAneNenu
#Baahubali2
#MaheshBabu

టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్‌బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు సంచలన విజయాలతో దూసుకెళ్తున్నారు. వారు బాహుబలి, రంగస్థలం, భరత్ అను నేను, జై లవకుశ చిత్రాలు రికార్డు స్థాయి వసూళ్లను సాధించాయి. ఓవర్సీస్‌లో బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా టాలీవుడ్ హీరోల చిత్రాలు కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఆ సర్వేలో ప్రిన్స్ మహేష్‌పై ప్రభాస్ విజయం సాధించడంతో దక్షిణాదిలో ప్రభాస్ అతిపెద్ద సూపర్‌స్టార్‌గా నిలవడం గమనార్హం.
గతంలో బాహుబలి2 చిత్రం చెన్నై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. అయితే బాహుబలి రికార్డును ఇటీవల విడుదలైన ప్రిన్స్ మహేష్‌బాబు చిత్రం భరత్ అనే నేను అధిగమించింది. భరత్ అనే నేను 2018లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇలా భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న హీరోల్లో ఎవరు దక్షిణాది సూపర్‌స్టార్ అనే విషయంపై చర్చ జరిగింది. ఆ విషయాన్ని తేల్చేందుకు సౌత్ సూపర్‌స్టార్ ఎవరు అనే పోటీని ఓ ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ పోటీలో 52 శాతం ఓట్లతో ప్రిన్స్ మహేష్‌పై ప్రభాస్ గెలిచినట్టు ఓ ఆంగ్ల వెబ్ పత్రిక కథనంలో పేర్కొన్నది.

Share This Video


Download

  
Report form