పరకాల రాజీనామా పై స్పందించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Oneindia Telugu 2018-06-19

Views 33

Parakala Prabhakar, life partner of BJP leader and Union Minister for Defence Nirmala Sitharaman, resigned from his position as Advisor (Communication), Government of Andhra Pradesh on Tuesday. He released his resignation letter to the media.
#ParakalaPrabhakar
#NirmalaSitharaman

ఏపీ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన అంశంపై తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. మంగళవారం రాజీనామా విషయం తెలియగానే మీడియాతో మాట్లాడారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించే అవకాశం లేదని చెప్పారు.
పరకాల టీడీపీ సభ్యుడు కాదని సోమిరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలో మాత్రమే భాగస్వామి అన్నారు. ఒక ముద్దాయి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పరకాల తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన విషయం తెలిసిందే. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
జగన్ వ్యాఖ్యల నేపథ్యంలోనే పరకాల రాజీనామా చేసిన నేపథ్యంలో జగన్ ఏమన్నారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ పొత్తు తెగిపోయినా రెండు పార్టీలకు సంబంధించిన పదవుల్లో ఉన్న కుటుంబాలను చూపించి వైసీపీ పదేపదే టీడీపీని నిలదీస్తోంది. ఇందులో భాగంగా జగన్ సోమవారం మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ఉంటారని, ఆమె భర్త పరకాల ఇక్కడ పదవిలో ఉంటారని వ్యాఖ్యానించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS