రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. దీంతో కొద్దిసేపు ఆ టోర్నీని మరిచిపొమ్మంటున్నాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ప్రస్తుత మాజీ క్రికెటర్ల పుట్టినరోజు నాడు తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరించడంతో పాటు... తనకు నచ్చిన విషయాలపై కూడా అప్పుడప్పుడు సెటైరిక్ ట్వీట్స్ చేస్తుంటాడు. తాజాగా అలాంటి ట్వీట్ సెహ్వాగ్ అభిమానులను కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.ప్రస్తుతం యావత్ ప్రపంచం మొత్తం రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మునిగితేలుతుంటే... అందుకు సంబంధించిన వీడియోని సెహ్వాగ్ తన ట్వీట్టర్‌లో పోస్టు చేశాడు. "ఇంగ్లాండ్, ఫ్రాన్స్, క్రొయేషియాలను మరిచిపోండి.. ఇతన్ని చూడండి" అంటూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
What a fantastic victory.Congratulations on your 1st goal and for making it extra special with marvellous move and a fantastic victory in front of a house window.
#france
#england
#croatia
#virendrasehwag
#fifaworldcup2018