సెలెబ్రిటీల బ్రేక్ అప్ లు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్ వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. హృతిక్ రోషన్, సుషాన్నే ఖాన్ 2014 లో విడాకులు పొంది విడిపోయారు. అప్పట్లో ఈ విషయంలో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు కంగనా రనౌత్ పంపిన ప్రేమ లేఖల వ్యవహారం కూడా హృతిక్ జీవితంలో ఇబ్బందులకు కారణంగా మారింది. అభిమానుల్లో మాత్రం హృతిక్ కి క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. తాజగా హృతిక్ జీవితంలో మరో సంచలనం మొదలైందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇది అతడి జీవితానికి మంచి చేసే పరిణామమే.
#hrithikroshan
#sussannekhan
#bollywood
#KanganaRanaut