ప్రపంచ సినిమా పరిశ్రమలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్ కౌచ్ (ఆఫర్ల కోసం పడక గదిలోకి)పై విలక్షణ నటి అదితిరావు హైదరీ స్పందించారు. ఔత్సాహిక తారలను పట్టి పీడిస్తున్న ఈ సమస్య ఇప్పటిది కాదు అని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం భారీ ఎత్తున్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమెకు ఎదురైన విషయాలను వెల్లడించింది.
నా కెరీర్ ఆరంభంలో బాలీవుడ్లో ఇలాంటి సమస్య ఎదురైంది. కొందరి కోర్కెలు తీర్చలేక ఆఫర్లు వదులుకొన్నాను. నాకు ఎదురైన అనుభవాలను తట్టుకోలేక భోరున ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి వాటికి లొంగక ఆఫర్లు వదులకోవడం వల్ల నాకు ఎలాంటి పశ్చత్తాపం లేదు అని అదితిరావు అన్నారు.
#AditiRao
#Sammohanam
#MohanakrishnaIndraganti