Debutant Shardul Thakur's Test career started in the worst possible manner as he was forced to walk off the field only after bowling ten deliveries on Day 1 of the second match against the West Indies at Hyderabad Friday.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#cricket
#westindiesinindia2018
#westindies
#teamindia
టీమిండియా యువ పేసర్ శార్థుల్ ఠాకూర్‌ను దురదృష్టం వెంటాడింది. నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టు ద్వారా శార్ధూల్ ఠాకూర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ఫీల్డింగ్‌కు దిగింది. తన అరంగేట్ర టెస్టులో మంచి ఉత్సాహంతో బంతి అందుకున్న శార్థుల్ సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. దీంతో నొప్పితో మైదానంలోనే అతడు విలవిల్లాడు.నడిచేందుకు కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. దీంతో.. మైదానంలోకి వచ్చిన ఫిజియో అతడికి సపర్యలు చేసి.. కెప్టెన్‌తో మాట్లాడిన అనంతరం నెమ్మదిగా నడిపించుకుంటూ వెలుపలికి తీసుకెళ్లాడు. స్కానింగ్ తర్వాత అతని గాయంపై స్పష్టత రానుంది.