Bigg Boss telugu season 2 title winner kaushal manda receives bahu mukha pragna ratna award from ex chief minister rosaiah.
#Kaushalmanda
#kaushalarmy
#BiggBossteluguseason2
#rosaiah
#tollywood
‘బిగ్‌బాస్’ సీజన్ 2 తెలుగు కార్యక్రమం ముగిసి నెల దాటిపోయింది. అయినప్పటికీ ‘బిగ్‌బాస్’ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్‌కు బయటికి వచ్చాక కూడా క్రేజ్ తగ్గడం లేదు. కొన్నాళ్ల క్రితం ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చిన కౌశల్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. స్టార్ హీరోలను చూసేందుకు వచ్చేంత స్థాయిలో కౌశల్‌తో ఫోటోలు దిగేందుకు, దగ్గర్నుంచి చూసేందుకు జనం ఎగబడడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ‘బిగ్‌బాస్’ టైటిల్ గెలిచినందుకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్వయంగా అభినందిస్తూ ట్వీట్ చేయడమూ తెలిసిందే. ‘బిగ్‌బాస్’ ఓట్ల ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్న కౌశల్, తాజాగా రోశయ్య చేతుల మీదుగా ‘బహుముఖ ప్రజ్ఞారత్న’ బిరుదు అందుకున్నాడు.