తమిళ స్టార్ విశాల్ గురువారం ఉదయం అరెస్ట్ అయ్యాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న విశాల్... కౌన్సిల్ కార్యాలయానికి వేసిన తాళాలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశాల్, పోలీసుల మధ్య తీవ్రవాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న విశాల్ మీద నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెళ్లువెత్తాయి. దీంతో కొందరు నిర్మాతలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీరాజా నేతృత్వంలోని ఓ వర్గం కౌన్సిల్ కార్యాలయానికి బుధవారం తాళం వేశారు.