After coming to power for the second time, trs chief KCR started Operation Akarsh once again. Speed up the plan to attract opposition leaders. He is planning to drive them towards the car. It seems to be he is trying to create no opposition status to congress party.
#KCR
#TRS
#KTR
#congress
#OperationAkarsh
అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి కారు రథసారథి కంకణం కట్టుకున్నారా? రాష్ట్రంలో టీడీపీ మాట వినబడకుండా చేయడమే గులాబీ బాస్ పంతమా? ఆ రెండు పార్టీలకు చుక్కలు చూపించడమే మంత్రాంగమా? తాజా పరిణామాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధనం వస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్.. గులాబీ వనానికి కలిసొచ్చిన అంశం. విపక్ష నేతలను ఇట్టే ఆకర్షించగల మంత్రం గులాబీ సొంతం. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగిన గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ కు విపక్ష పార్టీల పునాదులు కదిలిన సందర్భం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మరికొందరు ముఖ్యనేతల్ని కారు ఎక్కించేశారు. ముఖ్యంగా భాగ్యనగరంలో గులాబీ వికసించేలా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్.. "కారుకు" మంచి మైలేజ్ ఇవ్వడం విశేషం.