కోదండరాం మద్దతు కోరిన రేవంత్ రెడ్డి...!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-18

Views 337

Telangana Congress Working President Rewant Reddy will contest from Malkajigiri Lok Sabha seat. He is not just dependent on the Congress party for his conquest.Telangana Congress Working President Revanth Reddy on Monday met TJS chief Kodandaram for his support in Lok Sabha elections
#loksabhaelections2019
#kodandaram
#revanthreddy
#malkajgiri
#telangana
#congress
#tjs
#trs
#kcr
#utthamkumarreddy

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. తన గెలుపు కోసం ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ పైనే ఆధారపడటం లేదు. తన గెలుపుకు కృషి చేయాలంటూ ఆదివారం లెఫ్ట్ పార్టీ నేతలను కలిశారు. తాజాగా, సోమవారం తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాంతో గంటసేపు భేటీ అయ్యారు. మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నానని, మద్దతివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. మల్కాజిగిరిలో గెలవడానికి కోదండరాం సహకారం అవసరమని చెప్పారు. మల్కాజిగిరి మినీ భారతమని, ఇక్కడి సమస్యలపై తాను పోరాటం చేస్తానని చెప్పారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, ఇంతమంది ఎంపీలు ఉండి ఈ అయిదేళ్లలో ఏం సాధించారన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతులు ఉండాలన్నారు. పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెబుతామన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS