జిల్లాలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో టాప్ లో ఉన్న తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం సడల్లేదు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోయిన వీరాపురం మండలంలోని గ్రామాల్లో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని వీరాపురంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య గురువారం పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఘటన చోటు చేసుకుని 24 గంటలు దాటినప్పటికీ..అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు. వీరాపురం మండలంలోని అనేక గ్రామాలు నివురు గప్పిన నిప్పులా తయారయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాడులు, ప్రతిదాడులను నివారించడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను తరలించారు. హింసాత్మక ఘటనకు కేంద్రబిందువైన వీరాపురం మండలంలో 300 మంది కేంద్ర బలగాలను మోహరింపజేశారు.
#tadipatri
#assembly
#polling
#securityforces
#Tadipatri
#Ananthapur
#PullaReddy
#SiddaBhaskarReddy