Varanasi has a wide variety of specialties and is of great importance. This is because Prime Minister Narendra Modi is coming from here for the second time. He filed a nomination papers on Friday. In the final phase, elections will be held on May 19.
#loksabhaelections2019
#narendramodi
#bjp
#varanasi
#kasi
#uttarpradesh
#congress
#priyankagandhi
ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా వారణాసి పేరే మారుమోగిపోతోంది. బెనారస్ పట్టుచీరల నుంచి రైలింజిన్ల ఉత్పత్తివరకు అనేక రకాల ప్రత్యేకతలున్న వారణాసికి రాజకీయంగానూ అమిత ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ వరుసగా రెండోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. గురువారం భారీర్యాలీ నిర్వహించిన ఆయన, శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. చిట్టచివరి దశలో మే 19న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఒడిశాలోని పూరీ నుంచి కూడా బరిలోకి దిగుతారని తొలుత ప్రచారం జరిగినా చివరకు మోదీ వారణాసి వైపే మొగ్గు చూపించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం వల్లనే యూపీలో 80కి 71 ఎంపీ సీట్లను తాము దక్కించుకోగలిగామని బీజేపి బలంగా నమ్ముతోంది.