చనిపోయాక నా ఫొటో ప్రతి ఇంట్లో పెట్టుకునేలా పని చేస్తా : జగన్ | Every House Should Be With My Photo

Oneindia Telugu 2019-06-24

Views 1

AP CM YS Jagan Mohan Reddy said that after he lost his life , the photographs of his house were to work in every house. YS Jagan did a lot of interesting things at the Collectors Conference in Vudavally public forum. Speaking on the occasion, Jagan said, "Democracy and the Constitution are to be protected by the authorities''
#appolitics
#amaravathi
#tdp
#modi
#demolish
#bjp
#chandrababu
#Collectors
#Conference

తాను చనిపోయిన తర్వాత తన ఫొటో ప్రతి ఇంట్లో పెట్టుకునేలా పనిచేయాలన్నదే తాపత్రయం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉండవల్లి ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులో వైఎస్ జగన్ పలు ఆసక్తికర విషయాలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అధికారులే కాపాడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో గౌరవం, అభిమానం పెరగాలన్నారు. ప్రతి సోమవారం ప్రతి ఆఫీసులో గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించాలని.. ఆ రోజు ఎలాంటి మీటింగ్‌లు పెట్టుకోవద్దని కలెక్టర్లకు సీఎం సూచించారు. గ్రీవెన్స్‌సెల్‌కు ఎవరొచ్చినా ఒక రిసిఫ్ట్‌ ఇవ్వండి, ఫోన్‌ నెంబర్‌ తీసుకోండని జగన్ సలహా ఇచ్చారు. మీ సమస్యను ఇన్నిరోజుల్లో పరిష్కరిస్తానని చెప్పండి ప్రజలకు హామీ ఇవ్వండని కలెక్టర్లకు జగన్ వివరించారు. వారానికి ఒక్కరోజు గ్రామాల్లో రాత్రి బస చేయండని.. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారాలన్నారు. విద్య, వైద్యం, రైతులే మా ప్రధాన అజెండా అని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS