అందరికీ హాయ్, నేను డాక్టర్ నీర్జా హజేలా. నేను యాకుల్ట్ డనోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సైన్స్ అండ్ రెగ్యులేటరి అఫైర్స్ ప్రధాన అధికారిని. మనలో చాలా చాలా మందికి ప్రోబయోటిక్స్ మరియు యాకుల్ట్ పై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటికి నేను జవాబు ఇవ్వగలనని ఆశిస్తున్నాను.
ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి అని మనమంతా ఆశ్చర్యపోతుంటాము మరియు మనలో చాలమంది ఈ పదాన్ని ఇంతకు ముందు విని ఉంటారు, కానీ అసలు దాని అర్థం ఏమిటో తెలియదు. ఈ పదానికి అసలు అర్థం 'జీవితం కోసం'. అవును, ఇవి మనకు అవసరమైన బ్యాక్టీరియా.
శాస్త్రీయంగా నిరూపించబడిన ఆరోగ్య ప్రయోజనాల్ని మనకు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో జీవంగా మన పేగుల్లోకి చేరి ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అవి మన రోగ నిరోధక శక్తిని రూపొందిస్తాయి మరియు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాటి గురించి 2001లో డబ్ల్యూహెచ్ఓ మరియు ఎఫ్ఏఓ ద్వారా ఆమోదించబడింది. కాబట్టి ప్రోబయోటిక్స్ పాల ఉత్పత్తుల రూపంలో లభిస్తున్నాయి. కానీ అవి పులియబెట్టిన ఆహారాల కంటే భిన్నమైనవి. ఎందుకంటే మన పులియబెట్టిన ఆహారాలు శాస్త్రీయంగా పరీక్షించబడిన ఆ విలక్షణమైన బ్యాక్టీరియాని కలిగి ఉండవు .