CM jagan asked ED court to permit co accused presence in place of him.Jagan lawyer expalained the court that Due to heavy work as CM he unable to attend court regularly.
కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఏడాది విరామం తరువాత ఆయన కోర్టు ముందుకొచ్చారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం 11 ఛార్జ్ షీట్లతో పాటుగా ఈడీ దాఖలు చేసిన ఆరు షీట్ల పైన విచారణ జరిగింది. వీటన్నింటినీ కలిపి విచారణ చేయాలంటూ ఇప్పటికే జగన్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. అదే సమయంలో తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరగా సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి నిరాకరించింది.